టాలెంట్ ను ఎవరు ఆపలేరు.. సుధీర్ సక్సెస్ చూస్తే సంతోషం వేస్తుంది: అనసూయ

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే కమెడియన్ నుంచి టీం లీడర్ గా ఎదిగారు అలాగే యాంకర్ గా కూడా తన మార్క్ ఏంటో చూపించారు. ఇలా బుల్లితెరపై తన టాలెంట్ తో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను సందడి చేసిన సుడిగాలి సుదీర్ ఈమధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన గాలోడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా శుక్రవారం విడుదలయి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ మాట్లాడుతూ ..తాను కేవలం సుధీర్ కోసమే ఈ కార్యక్రమానికి వచ్చానని ఈమె తెలియజేశారు. సుధీర్ వేణు వండర్స్ టీంలో కమెడియన్ గా ఉన్నప్పటి నుంచి తనకు మంచి పరిచయం.

ఇలా కమెడియన్ గా ఉన్నటువంటి సుధీర్ తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగారు. ఇలా సుదీర్ సక్సెస్ చూస్తే తనకు చాలా సంతోషం వేస్తుందని ఎవరు కూడా మన టాలెంట్ ఆపలేరని ఈ సందర్భంగా అనసూయ సుధీర్ గురించి ఆయన నటించిన గాలోడు సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఇలా గాలోడు సినిమా గురించి సుధీర్ గురించి అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.