ఫ్యాన్ బేస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ సునీత.. నేనంటే ఇష్టమా.. నా పాట అంటే ఇష్టమా?

సింగర్ సునీత టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు కొన్ని వందల పాటలను ఆలపించడమే కాకుండా ఏకంగా 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన ఘనత సునీతకు చెల్లుతుందని చెప్పాలి. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గాను,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఈమెకు అభిమానులు ఎంతలా అంటే ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సునీతకు తన ఫ్యాన్ బేస్ పై ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోని యాంకర్ ప్రశ్నిస్తూ టాప్ హీరోయిన్ కు సమానమైన ఫ్యాన్ బేస్ మీకుంది మీరు ట్రెండ్ సెట్టారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూఅదే నాకు అర్థం కాని విషయం అసలు వాళ్లంతా నాలో ఏం చూసి అభిమానిస్తున్నారు అర్థం కాలేదు అంటూ సమానం చెప్పక అంటే మీకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఒప్పుకున్నట్లే కదా అంటూ యాంకర్ బుక్ చేశారు.

ఇక ఈ విషయంపై సునీత మాట్లాడుతూ తనకు చాలామంది అభిమానులు ఉన్నారని అయితే వాళ్లంతా నన్ను చూసి ఇష్టపడుతున్నారా లేకపోతే నా పాటను చూసి ఇష్టపడుతున్నారా అనే విషయం నాకు తెలియదని ఈమె వెల్లడించారు.ఈ క్రమంలోనే చాలామంది నేను కలవగానే మీ పాటంటే చాలా ఇష్టం అని చెబుతారు అయితే ఒకసారి మాత్రం ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు.అక్కడికి తన బౌన్సర్లు తనని ఆపే ప్రయత్నం చేసిన తను ఆగలేదు దీంతో తనని పంపించమని చెప్పానని సునీత వెల్లడించారు.ఆయన నా వద్దకు రాగానే వెంటనే తన ఫోన్ తీసి అందులో నా ఫోటో చూయించి ఈ చీర మీరు ఎక్కడ కొన్నారు అంటూ ప్రశ్నించాడని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు ఇలాంటి చీర తన భార్యకు కొనాలనుకుంటున్నాను చెప్పండి అంటూ నన్ను ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురి చేసింది.ఇలా పలు రకాలుగా నన్ను ఇష్టపడుతూ నాకు ఇంతమంది అభిమానులు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా ఈమె తనకున్న ఫ్యాన్ బేస్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.