టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన మంగ్లీ గురించి తెలియని వారంటూ ఉండరు. పేదరికంలో పుట్టి పెరిగిన మంగ్లీ తన గాత్రంతో అందరిని ఆకట్టుకొని ఇప్పుడు స్టార్ సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మారుమూల గ్రామంలో పేదరికంలో పుట్టి పెరిగిన మంగ్లీ హైదరాబాద్ వచ్చిన తర్వాత తీన్మార్ న్యూస్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తన మధురమైన గాత్రంతో జానపద గీతాలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంది.
ఇలా రోజురోజుకీ తన టాలెంట్ నిరూపించుకుని ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇలా పాపులర్ అయిన మంగ్లీ సినిమాలలో పాటలు పాడే అవకాశాలను దక్కించుకుంది. మొదట సినిమాలలో పాటలు పాడటానికి ఒక పాటకి రూ. 10 వేల రూపాయలు పారితోషికం అందుకునేది. కానీ ఇప్పుడు మంగ్లీ సింగర్ గా పాపులర్ అవటంతో ఒక్కో పాటకి దాదాపు రూ.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంగ్లీ అక్కడ కూడా తన పాటలతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా మంగ్లీకి అధిక సంఖ్యలో వ్యూస్ రావడంతో సోషల్ మీడియా ద్వారా కూడా భారీగానే ఆదాయం వస్తోంది. ఇలా ఒకవైపు సినిమాలలో పాటలు పాడుతూ మరొకవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా కూడా మంగ్లీ అధిక మొత్తంలో సంపాదిస్తున్నట్లు సమాచారం.