వామ్మో… హీరోయిన్ హన్సిక పెళ్ళి ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

దేశముదురు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన హన్సిక గురించి తెలియని వారంటూ ఉండరు. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హన్సిక స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. ఇలా తెలుగు తమిళ్ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన హన్సిక కోసం అభిమానులు గుడి కూడా కట్టించారు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన హన్సిక తమిళ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల హన్సిక వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజస్థాన్‌ జైపూర్‌లోని ముందోట ఫోర్ట్ ప్యాలెస్‌లో డిసెంబర్ 4వ తేదీ ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కథూరియాని వివాహం చేసుకుంది.

తన స్నేహితురాలి భర్త అయినా కథూరియా ని హన్సిక ప్రేమించి వివాహం చేసుకుంది. సొహైల్ కథూరియా మొదట హన్సిక స్నేహితురాలు అయిన రింకి బజాజ్ ని వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో ఇద్దరూ విడాకులు తీసుకొని ఒకరికొకరు దూరం అయ్యారు. దీంతో హన్సిక, సోహైల్ మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది.గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పారిస్ లో ఈఫిల్ టవర్ ఎదురుగా సోహెల్ హన్సికకి ప్రపోజ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ప్రేమ విషయం వెల్లడించింది.

ఇక తాజాగా డిసెంబర్ 4వ తేదీ జైపూర్‌లోని ముందోట ఫోర్ట్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య హన్సిక వివాహం చాలా ఘనంగా జరిగింది. హన్సిక పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా హన్సిక పెళ్లికి అయిన ఖర్చు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. హన్సిక సోహైల్ తమ పెళ్లి కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జైపూర్ లో నాలుగు రోజులపాటు జరిగిన వివాహానికి దాదాపు 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.