Home News బిగ్ బాస్ 4: గ‌తాన్ని గుర్తు చేసిన బిగ్ బాస్.. ఎమోష‌న‌ల్ అవుతూ కంట‌క‌న్నీరు పెట్టుకున్న...

బిగ్ బాస్ 4: గ‌తాన్ని గుర్తు చేసిన బిగ్ బాస్.. ఎమోష‌న‌ల్ అవుతూ కంట‌క‌న్నీరు పెట్టుకున్న హౌజ్‌మేట్స్

బిగ్ బాస్ షోలో న‌టించ‌డం అనేది ఉండ‌దు. ఈ రియాలిటీ షోలో అంత‌గా రియ‌ల్‌గానే ఉండాల్సి వ‌స్తుంది. కోపం, ఆవేశం, బాధ‌, ఎమోష‌న్, హ‌స్యం ఇలా అన్ని మ‌న‌లో నుండి త‌న్నుకుంటూ బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఎంత న‌టించాల‌నుకున్నా కూడా ఏదో ఒక సంద‌ర్భంలో ఎమోష‌న్స్ అన్నీ ఆటోమెటిక్‌గా బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. వంద రోజుల‌కి పైగా న‌లుగు గ‌దుల మద్య సాగే ఈ ఆట బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందిస్తుంది. మ‌రో వైపు ఇందులో గ‌డిపిన ప్ర‌తి స‌మ‌యం హౌజ్‌మేట్స్‌కు తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయి.

Bigg Love | Telugu Rajyam

డిసెంబ‌ర్ 20న బిగ్ బాస్ సీజ‌న్ 4 గ్రాండ్ ఫినాలే ఉండ‌గా, ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహ‌కులు. ఇక ఈ వారం సీజ‌న్ 4 చివ‌రి వారం కావ‌డంతో ఫైన‌లిస్ట్‌లని అన్ని ర‌కాలుగా ఎంట‌ర్టైన్ చేస్తూ వ‌స్తున్నారు. గెస్ట్‌ల‌తో మాట్లాడిస్తూ, వారి తీపి గురుతులని క‌ళ్ల ముందు ఉంచుతూ వాళ్ళకు అన్ని ర‌కాల వినోదాన్ని అందిస్తున్నారు. ఈ రోజు ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌ని ఎమోష‌న్‌తో కంట క‌న్నీరు పెట్టించారు . తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో వాళ్ళ జ‌ర్నీని చూపించారు. 100 రోజుల జ‌ర్నీని చూసి చాలా ఎమోష‌న్ అయ్యారు. ఎలిమినేట్ అయిన వాళ్ళ‌తో ఉన్న బాండింగ్ గుర్తొచ్చి ఏడ్చారు

త‌మ‌కు ఇలాంటి మెమోర‌బుల్ గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్‌కు అంద‌రు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హారిక అయితే రేపు నేను ఉన్నా లేకపోయినా నా జీవితంలో మాత్రం బిగ్ బాస్ ఓ తీపి జ్ఞాపకంగా ఉంటుందంటూ కన్నీరు పెట్టుకుంది . ఇక అరియానా, సోహైల్, అఖిల్‌, అభిజీత్‌లు కూడా చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. బిగ్ బాస్ తన జీవితంలో మరిచిపోలేని ఫీలింగ్ అని చెప్పాడు అఖిల్. క‌రోనా స‌మ‌యంలోను ఎంతో స‌క్సెస్‌ఫుల్‌గా బిగ్ బాస్ షోని నిర్వ‌హించి ఫైన‌ల్ స్టేజ్‌కు తీసుకురావడం నిజంగా గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి. 

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

Latest News