బిగ్ బాస్ 4 – న‌క్క తోక తొక్కిన సోహైల్.. బంపర్ ఆఫర్

ఎన్నో సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టించిన రాని పేరు బిగ్ బాస్ షోతో తెచ్చుకున్నాడు సోహైల్‌. సీజ‌న్ 4లో టాప్ 3 ప‌ర్స‌న్‌గా నిలిచిన సోహైల్ రూ. 25 ల‌క్ష‌లు తీసుకొని బిగ్ బాస్ హౌజ్ నుండి నిష్క్ర‌మించాడు. అందులో ఐదు ల‌క్ష‌లు అనాథ‌శ్ర‌మాల‌కి, రూ.5 ల‌క్ష‌లు మెహ‌బూబ్‌కు ఇస్తాన‌ని అన్నాడు. సోహైల్ మంచిత‌నాన్ని చూసి మురిసిపోయిన నాగార్జున ఆ ప‌ది ల‌క్ష‌లు నీ ద‌గ్గ‌రే ఉంచుకో, నువ్వు సాయం చేయాల‌నుకున్న ప‌ది ల‌క్ష‌లు నేను నీకు ఇస్తాన‌ని అన్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఫినాలేకు ముఖ్య అతిథిగా వ‌చ్చిన చిరంజీవి కూడా సోహైల్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డ‌మే కాకుండా అత‌ని మేన‌రిజాన్ని అనుక‌రించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అంతేకాక అత‌నికి బిర్యానీ కూడా పంపారు. ఇక ఎంతో టాలెంట్ ఉన్న సోహైల్‌కు త‌న స‌పోర్ట్ అందిస్తాన‌న్న చిరంజీవి వీలైతే నీ చిత్రంలో కామియో రోల్ చేస్తాన‌న్నాడు. అత‌ని ఊత‌ప‌దం ‘కథ వేరే ఉంటుంది’ తన సినిమాలో వాడుకుంటాన‌ని చెప్పాడు. ఇలా చిరంజీవి నుండి సోహైల్‌కు వ‌రుస ఆఫ‌ర్స్ రావ‌డంతో అత‌ను ఉబ్బిత‌బ్బిబై పోయాడు. స్నేహం కోసం సోహైల్ చేసిన త్యాగాల‌కు ఇంప్రెస్ అయిన ఇత‌ర ప్ర‌ముఖులు కూడా అత‌ని సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

తాజాగా ప్రముఖ టాలీవుడ్ కమెడీయన్ బ్రహ్మానందం కూడా సోహెల్ చేసే సినిమాలో రూపాయి తీసుకోకుండా నటిస్తానని తెలిపాడట.అత‌ని క‌ష్టం, ప్యాష‌న్ చూసి బ్ర‌హ్మానందం ఈ నిర్ణయం తీసుకున్నాడ‌ట‌. బ్ర‌హ్మానందం రెమ్యున‌రేష‌న్ లేకుండా సినిమాలే చేయ‌డని అంటారు అలాంటిది సోహైల్ కోసం ఒక్క రూపాయి తీసుకోకుండా న‌టిస్తాన‌ని అన‌డం గొప్ప విష‌యం అని చెప్ప‌వ‌చ్చు. మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజం ఉంద‌నేది క్లారిటీ రావ‌ల‌సి ఉంది.