సౌత్ సినిమాలలో నటించాలని ఉంది…బాలీవుడ్ స్టార్ హీరో…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలలో హీరోగా నటించిన సంజయ్ దత్ ఇప్పుడు సినిమాలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాలో అధీరా పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం మరొక కన్నడ హీరో ధ్రువ సర్జ హీరోగా నటించిన కేడి సినిమా త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి సంజయ్ దత్ తన గాత్రాన్ని అందించాడు. ఇక ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ దత్ మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో సంజయ్ దత్ మాట్లాడుతూ.. నాకు దర్శకుడు రాజమౌళి మంచి మిత్రుడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలైన కేజీఎఫ్‌-2 సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. సౌత్ దర్శకులకు సినిమాలపై ఉన్న ప్రేమ వారు తీసే చిత్రాల్లో కనిపిస్తుంటుంది. హీరో యశ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఇప్పుడు ధ్రువ్‌ సర్జాతో నటించటానికి ఎదురు చూస్తున్నా. ఇకపై కూడా దక్షిణాది సినిమాల్లో నటించాలని కోరికగా ఉంది అంటూ సౌత్ ఇండస్ట్రీ పై తనకున్న ప్రేమని వ్యక్తపరిచారు. ఇదిలా ఉండగా.. ప్రేమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కేడీ” 1970లో బెంగళూరులో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇక ఈ సినిమాకి అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కన్నడ,తెలుగు, తమిళ్, మలయాళీ, హింది భాషలలో విడుదల కానుంది.