సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ కి ప్రేమ కథలకి లోటే ఉండదు. ఈరోజు ఒకరితో ఎఫైర్, రేపు మరొకరితో డేటింగ్, మరుసటి రోజు మరొకరితో పెళ్లి చాలా తక్కువ సమయంలోనే ఆ పెళ్లి నుంచి విడాకులు పొందడం, మళ్లీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం. సినీ ఫీల్డ్ లో మనం ఎక్కువ ఇలాంటి వార్తలనే ఆలకిస్తూ ఉంటాం. అయితే ఒక నటి ఏకంగా ఆరుగురు స్టార్ హీరోలతో ఎఫైర్ నడిపింది, అలాగే రెండు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంది. అయినా ప్రస్తుతం ఆరుపదుల వయసులో ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.
ఇంతకీ ఆ నటి ఎవరనుకుంటున్నారా బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఒకప్పటి స్టార్ నటి రేఖ. బాల తారగా రంగులరాట్నం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె కెరియర్ పరంగానే కాకుండా పర్సనల్ వ్యవహారాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఈమె పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే రేఖ భర్త ముఖేష్ అగర్వాల్ అనుకోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ సమయంలో ఆమెపై చాలా ట్రోల్స్ వచ్చాయి. బాలీవుడ్ నటుడు వినోద్ మెహ్ర ని వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే అతని తల్లి రేఖని కోడలిగా అంగీకరించలేదంట. కొద్దిరోజుల తర్వాత ఆయన కూడా మరణించడంతో రేఖ మళ్ళీ ఒంటరిదైంది. ఈమె గతంలో అమితాబచ్చన్ ని ప్రేమించిందని పెళ్లి కూడా చేసుకోవాలనుకుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదు అని ఖండించింది రేఖ.
ఆ తరువాత నటుడు జితేంద్ర తో కూడా ప్రేమాయణం సాగించిందని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి ఆ తర్వాత వరుసగా నవీన్ నిశ్చల్, కిరణ్ కుమార్, రాజ్ బబ్బర్, సంజయ్ దత్ లతో కూడా రేఖ ప్రేమాయణం సాగించింది. ఇక కొసమెరుపు ఏమిటంటే నటుడు కమల్ హాసన్ తో హోటల్ రూమ్ లో దొరికిపోయినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇన్ని ఎఫైర్స్, ఇన్ని పెళ్లిళ్లు ఉన్నా కూడా ఆమె 69 సంవత్సరాల వయసులో ఒంటరిగా ఉండడం అనేది బాధాకరం.