Sanjay Dutt: బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో చాలా సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంజయ్ దత్. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు. కేజిఎఫ్ సినిమాలో విలన్ నటించి మెప్పించడంతోపాటు భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత సంజయ్ దత్ కు అవకాశాలు కూడా పెరిగాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సంజయ్ దత్ కేడి ది డెవిల్ అనే కన్నడ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఈ సందర్భంగా తాజాగా హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మీరు దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు కదా.. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఏం తీసుకెళ్తారు? అని ఒక రిపోర్టర్ అడగగా.. స్పందించిన సంజయ్ దత్.. మంచి సినిమాలు తీయాలనే ప్యాషన్ ని బాలీవుడ్ కి తీసుకెళ్తాను. గతంలో మా దగ్గర మంచి సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు మా వాళ్లు కలెక్షన్, నంబర్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ సౌత్ లో అలా కాదు.
ముఖ్యంగా తెలుగులో మూవీస్ పై మంచి ప్యాషన్ కనిపిస్తోంది. అందుకే నాకు ఇక్కడ పనిచేయడం సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం సంజయ్ దత్ మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విధంగానే బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇకపోతే సంజయ్ దత్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
