50వ రోజు క్రాస్ రోడ్స్ లో “వాల్తేరు వీరయ్య” యూనానిమస్ రికార్డు.!

ఈ ఏడాది సంక్రాంతి మాత్రం మెగా ఫాన్స్ అసలు మర్చిపోలేరు అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి తన రేంజ్ హిట్ కొడితే ఎలా ఉంటుందో మరోసారి మెగాస్టార్ చూపించారు. తాను నటించిన వాల్తేరు వీరయ్య అయితే మాస్ మహారాజా రవితేజ కలయికలో కలిసి ఎన్నో సంచలన రికార్డులు బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పింది.

అంతే కాకుండా నిన్నటితో 50 రోజుల రన్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ భారీ రన్ లో వాల్తేరు వీరయ్య మరిన్ని రికార్డులు నెలకొల్పినట్టుగా తెలుస్తుంది. కాగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే రికార్డులు కి కేరాఫ్ అని అందరికి తెలిసిందే. అక్కడ సింగిల్ స్క్రీన్స్ లో ఎన్నో సినిమాలకి ఎన్నో యూనిక్ రికార్డులు ఉన్నాయి.

మరి అలా లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్య కూడా ఒక యూనానిమస్ రికార్డు కొట్టినట్టుగా ట్రేడ్ చెప్తున్నారు ఈ సినిమా 50 రోజు టోటల్ గా క్రాస్ రోడ్స్ లో అయితే మొత్తం 3 లక్షల 86 వేలకి పైగా గ్రాస్ ని రాబట్టి టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డు నెలకొల్పింది.

దీనితో నెంబర్ 1 స్థానంలో మెగాస్టార్ భారీ మార్జిన్ తో యూనానిమస్ గా నిలిచారు. మొత్తానికి అయితే ఈ కొత్త జెనరేషన్ లో కూడా మెగాస్టార్ తన డామినేషన్ వేరే లెవెల్లో కనబరుస్తున్నారని చెప్పి తీరాలి. కాగా ఈ సినిమాని కొల్లి బాబీ దర్శకత్వం వహించగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.