వీడియో టాక్ : దుమ్ము లేచిపోయేలా “వాల్తేరు వీరయ్య” టైటిల్ ట్రాక్.!

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రాబోతున్న సాలిడ్ ఎంటర్టైనింగ్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రం తో అయితే మళ్ళీ వింటేజ్ బాస్ ని గుర్తు చేసేలా దర్శకుడు బాబీ కొల్లి తెరక్కేక్కిస్తుండగా దీని నుంచి వచ్చిన ప్రతి అంశం కూడా అదిరే లెవెల్ ట్రీట్ ని ఇచ్చింది.

ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇప్పుడు చిత్ర యూనిట్ బాగా ఊరిస్తూ వస్తున్న సాలిడ్ టైటిల్ ట్రాక్ అయితే రిలీజ్ చేసింది. ముందు పలు మ్యూజిక్ మాధ్యమాల్లో రిలీజ్ చేసిన ఈ సాంగ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు యూట్యూబ్ లో లిరికల్ గా రిలీజ్ చేసారు.

మరి ఈ సాంగ్ ఒక్క సారి విన్నాక నెక్స్ట్ లెవెల్ హైప్ ని ఇచ్చింది అని చెప్పడంలో సందేహమే లేదు. ఇంకా గత శ్రీదేవి సాంగ్ తో పోలిస్తే ఇది బిగ్గెస్ట్ హిట్ కాగా చంద్రబోస్ ఇచ్చిన సాహిత్యం కూడా ఇందులో మాస్ ని అలరించేలా సినిమాలో వీరయ్య పాత్రని భారీ లెవెల్లో ఎలివేట్ చేసేలా అనిపిస్తుంది.

ఇక దేవిశ్రీ ప్రసాద్ తన బీస్ట్ మోడ్ ని చాలా కాలం తర్వాత అందులోని మెగాస్టార్ రేంజ్ సాంగ్ ని ఇచ్చి పడేశాడు అని చెప్పి తీరాలి. ఇలా ఓవరాల్ గా మాత్రం ఈ మాస్ ట్రాక్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఖచ్చితంగా సినిమాలో మాత్రం ఇంకా పెద్ద హిట్ గా నిలుస్తుంది.

ఇక లాస్ట్ బట్ లీస్ట్ గా ఈ సాంగ్ లో మెగాస్టార్ పై సీక్వెన్స్ లు మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. తన సీన్స్ తన లుక్స్ అన్నీ సెక్సీ లెవెల్లో కనిపిస్తున్నాయి దీనితో మాత్రం డెఫినెట్ గా అనుకున్న పూనకాలు గట్టిగా వచ్చేలా ఉన్నాయి. ఇక మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సాలిడ్ చిత్రం జనవరి 13న అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.