హిందీ మార్కెట్ ని వదలనంటున్న రవితేజ..!

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకడు. అయితే ఇప్పుడు ఉన్న స్టార్స్ లో చాలా మంది ఒక్క తెలుగు మార్కెట్ కి మాత్రమే పరిమితం కాకుండా ఇండియా వైడ్ గా కూడా తమ మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తున్నారు.

మరి మెయిన్ గా హిందీ మార్కెట్ లో కానీ ఓ హీరో క్లిక్ అయితే తన సినిమాలకి వచ్చే వసూళ్లే వేరే లెవెల్లో ఉంటాయి. మరి అలా ఇప్పుడు రవితేజ హీరోగా చేస్తున్న సినిమాలు రీసెంట్ గా వచ్చిన అన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాడు. తన ఖిలాడీ, వాల్తేరు వీరయ్య చిత్రాలకి ముందే తన సినిమాలకి యూట్యూబ్ లో మంచి రీచ్ ఉంది.

దీనితో అలా ఒకో సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న రవితేజ తన లాస్ట్ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” తో ఒక బిగ్ బ్రేక్ తీసుకుంటాడు అనుకున్నాడు కానీ దానికి చాలా సో సో రెస్పాన్స్ హిందీ మార్కెట్ లో వచ్చింది. కాగా ఇది అయ్యాక నెక్స్ట్ సినిమా “ఈగిల్” ని మొదట ఒక్క తెలుగులోనే రిలీజ్ కి లాక్ చేశారు.

కానీ ఇప్పుడు సడెన్ గా హిందీ రిలీజ్ ని కూడా అనౌన్స్ చేయడం వైరల్ గా మారింది. హిందీలో ఇదే చిత్రాన్ని “సహదేవ్” అంటూ అనౌన్స్ చేశారు. ఇక దీనికి కూడా మళ్ళీ రవితేజ హిందీ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. మరి ఈ సినిమా ఎలా రన్ అవుతుంది అనేది ఈ జనవరి 13వరకు ఆగి చూడాల్సిందే.