“వాల్తేరు వీరయ్య” మాస్ సంభవం..ఇదేం అరాచకారం.. 

మన టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం సూపర్ టాక్ సంతరించుకొని మళ్ళీ మెగాస్టార్ రేంజ్ హిట్ గా అయితే నిలిచే దిశగా దూసుకెళ్తుంది.

మరి ఈ చిత్రం మొదటి రోజు థియేటర్స్ కొరత రీత్యా ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ అందుకోనప్పటికీ ఆ నెక్స్ట్ డే నుంచే వాల్తేరు వీరయ్య మాస్ డామినేషన్ ఆలోవర్ గా కనిపించడం విశేషం. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా వాల్తేరు వీరయ్య వసూళ్ళలో భారీ జంప్ కనిపించడం విశేషం.

దీనితో వాల్తేరు వీరయ్య డామినేషన్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. అలాగే లేటెస్ట్ గానే పక్క యూఎస్ నుంచే ఈ చిత్రం 2 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టి ఈ సినిమాతో రిలీజ్ అయ్యిన ఏ సినిమాకి కూడా అందకుండా దంచికొట్టడం ట్రేడ్ వర్గాల్లో అరాచకంగా మారింది. అంతే కాకుండా ఇక సెలవులు అయ్యిపోయాయి వర్కింగ్ డేస్ స్టార్ట్ అయ్యాయి అనుకుంటే ఇక్కడ కూడా వాల్తేరు వీరయ్య హవా తగ్గలేదట.

అనేక ప్రాంతాల్లో అయితే వీరసింహా రెడ్డి కన్నా చాలా బెటర్ వసూళ్లు హౌస్ ఫుల్స్ తో దుమ్ము రేపుతున్నట్టుగా ట్రేడ్ వర్గాల టాక్. దీనితో వాల్తేరు వీరయ్య మాస్ సంభవం మాత్రం చిరు చెప్పినట్టే నడుస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అయితే కొల్లి బాబీ దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు అలాగే మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటించగా క్యాథెరిన్ తన సరసన హీరోయిన్ గా నటించింది.