“వాల్తేరు వీరయ్య” అక్కడ పూర్తి డిజాస్టర్.?

Waltair-Veerayya-Cinima-unit-gave-another-official-update-960x540

ఈ ఏడాదికి టాలీవుడ్ లో ఆల్రెడి భారీ హిట్స్ తో ఓ పాజిటివ్ స్టార్ట్ అయితే వచ్చేసింది.  సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో వచ్చిన సినిమాలు వీరసింహా రెడ్డి, అలాగే వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు భారీ హిట్స్ అయ్యి అసలైన సంక్రాంతి తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమాల్లో ఓ రోజు లేట్ గా వచ్చినా కూడా వాల్తేరు వీరయ్య భారీ డామినేషన్ చూపించి అదరగొట్టింది.

మరి ఇంత పెద్ద హిట్ అయ్యిన ఈ చిత్రం మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే యూఎస్ లో కూడా సూపర్ హిట్ కాగా భారీ లాభాలు ఈ చిత్రం అందుకుంది. అయితే ఇంత వసూళ్లు వచ్చిన ఈ చిత్రం ఓ చోట మాత్రం జీరో వసూళ్లు తో డిజాస్టర్ అయ్యినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాని రిలీజ్ అప్పుడు తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ కి ప్లాన్ చేసారు చిత్ర నిర్మాతలు.

రవితేజ అలాగే చిరు కి కూడా డీసెంట్ మార్కెట్ అక్కడ ఉండగా ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేశారు. కానీ ఈ చిత్రం అసలు హిందీలో రిలీజ్ అయ్యిందో లేదో కూడా అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఒకవేళ రిలీజ్ అయ్యినా వసూళ్లు ఏవి? ఒక్క మాట కూడా దీనిపై సినీ ట్రాకర్స్ నుంచి వినపడట్లేదు.

తెలుగు సహా బాలీవుడ్ ట్రాకర్స్ కూడా వాల్తేరు వీరయ్య హిందీ వెర్షన్ పై ఏం చెప్పలేదు. దీనితో వాల్తేరు వీరయ్య మాత్రం అక్కడ భారీ డిజాస్టర్ అయ్యినట్టే అనుకోవాలి. మరి సినిమా అనుకున్నట్టు అక్కడ రిలీజ్ అయ్యిందో లేదో కూడా చాలా మందికి తెలియదు.