Ashoka Vanam lo Arjuna Kalyanam : మరోసారి రిలీజ్ వాయిదా పడిన విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం..!

Ashoka Vanam lo Arjuna Kalyanam : విశ్వక్సేన్ హీరోగా చేసిన కొన్ని సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. విద్యాసాగర్‌ చింత దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం.బి వి ఎస్‌ ఎన్‌ ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌ పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు.జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ మరియు టీజర్ ద్వారా సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయినది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పలు మార్లు వాయిదా పడుతూ వస్తున్నది. చివరగా ఈ ఏప్రిల్ 22 న అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ డేట్ ప్రకటించగా, కే జి ఎఫ్ చాప్టర్ టు మేనియా కారణంగా దర్శక నిర్మాతలు వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తర్వాత అశోకవనంలో అర్జునకళ్యాణం ఈ నెల 30వ తేదీన రిలీజ్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ అయితే ఈ సినిమాకు ఇబ్బంది అని భావించిన చిత్ర యూనిట్ మరో సారి వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

చివరిగా ఈ సినిమాను మే 6న రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మీ ఆరవ తేదీన అయినా విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తుందేమో అయినా చూడాలి.