Laila: విశ్వ‌క్ సేన్ లైలా మూవీ నుంచి సాంగ్ రిలీజ్.. స్టెప్పులను ఇరగదీసిన మాస్ కా దాస్!

Laila: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విశ్వక్ సేన్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో విశ్వక్ సేన్ నటించిన సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధిస్తుండడంతో దర్శకులు కూడా విశ్వక్ సేన్ తో సినిమాలు తీయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైలా. రామ్ నారాయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్ పై సాహు గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చి ఏడాది ఫిబ్రవరి 14 అనగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్. కాగా చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. వ‌రుస‌గా అప్‌డేట్‌లు ఇస్తూ ఈ మూవీపై అంచ‌నాల‌ను పెంచుతోంది.

Sonu Model (Full Video) | Laila | Vishwaksen | Akanksha Sharma | Ram Narayan | Leon James | Feb 14th

తాజాగా ఈ చిత్రం నుంచి సోను మోడ‌ల్ పాట‌ను విడుద‌ల చేసింది. ఈ పాటకు హీరో విశ్వ‌క్ స్టెప్పులను ఇరగదీసారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతోంది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి విశ్వ‌క్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి..