ఫుల్లుగా తగ్గించేందుకు రెడీ.. శ్రీముఖితో కలిసి విష్ణుప్రియ వర్కౌట్లు

Vishnu Priya workout with Srimukhi

శ్రీముఖి, విష్ణు ప్రియల స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై యాంకర్లుగా ఉన్న వీరు చివరకు ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. యాంకరింగ్‌లో శ్రీముఖి కాస్త సీనియరే అయినా కూడా విష్ణు ప్రియ మాత్రం బాగానే కలిసిపోయింది. ముందుగా విష్ణు ప్రియ యూట్యూబ్, షార్ట్ ఫిలింలతో బాగా ఫేమస్ అయింది. అలా అక్కడి నుంచి హీరోయిన్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రయత్నాలు ప్రారంభించింది. అలా బుల్లితెరపై యాంకర్‌గా ఫిక్స్ అయింది. యాంకర్‌గా బాగానే క్రేజ్ తెచ్చుకున్న విష్ణుప్రియ ఆ మధ్య హీరోయిన్‌గానూ మారింది.

Vishnu Priya workout with Srimukhi
Vishnu Priya workout with Srimukhi

అయితే విష్ణు ప్రియ శ్రీముఖి మధ్య స్నేహం మాత్రం చాలా ఏళ్ల క్రితమే. వారిద్దరి పరిచయం కూడా వెరైటీగా జరిగిందట. పోవే పోరా షో ఆడిషన్స్ కోసం విష్ణుప్రియ వెళ్లిన క్షణంలో అక్కడే శ్రీముఖి కూడా ఉందట. అలా మొదటి సారి శ్రీముఖిని చూసిందట విష్ణుప్రియ. అప్పుడు అంతగా పరిచయం లేకపోయినా కూడా రాను రాను మంచి స్నేహితుల్లా మారిపోయామని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా.. ఫ్యామిలీమెంబర్స్‌లా కలిసిపోయారు. శ్రీముఖి ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా కూడా విష్ణుప్రియ వెళ్తుంది.

శ్రీముఖి విష్ణుప్రియ కలిశారంటే చాలు అక్కడ సందడి వాతావరణం నెలకొనాల్సిందే. ఆ మధ్య శ్రీముఖి చేసిన ఉమెనియా షోలో విష్ణుప్రియ తెగ రచ్చ చేసింది. మామూలుగా తన బ్యాగ్‌లో తినుబండారాలనే నింపుకుంటుందని, తిండిబోతంటూ శ్రీముఖి ఏడిపించింది. అయితే ఇప్పుడు మాత్రం విష్ణుప్రియ తన శరీరాకృతిని మార్చుకోవాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే కొవ్వును కరిగించేందుక జిమ్‌లో చేరింది. శ్రీముఖితో పాటు కలిసి వ్యాయామం చేస్తోంది. విష్ణుప్రియ వర్కవుట్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.