సొంతిల్లు ఉన్నా… అద్దె ఇంట్లో నివసిస్తున్న విరాట్ అనుష్క దంపతులు.. ఎందుకో తెలుసా?

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఈ దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ ఇద్దరికీ ఇండియా మొత్తం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్.ఒకరు బాలీవుడ్ నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా మరి ఒకరు ఇండియన్ క్రికెటర్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఈ ఇద్దరు మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈ దంపతులు ప్రతి ఏడాది కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకున్నప్పటికీ ముంబైలో మాత్రం ఈ దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారనీ తెలుస్తోంది.

గత కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఆలీబాగ్ ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొలుగోలు చేసిన విరుష్క దంపతులు ఇక్కడ నివాసం ఉండకుండా ముంబైలో జుహూ ప్రాంతంలోని ఒక ఇంటిలో అద్దెకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటిలో అద్దెకు నివసించడమే కాకుండా ఈ ఇంటి కోసం నెలకు 2.72 లక్షల రూపాయల అద్దె చెల్లించడం గమనార్హం.ఇలా సొంత ఇల్లు ఉన్నప్పటికీ లక్షల్లో అద్దె చెల్లిస్తూ ఈ దంపతులు అద్దె ఇంట్లో ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే..

జుహు ప్రాంతంలో వీరు ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం కలిగి ఉండడమే కాకుండా ఈ అపార్ట్మెంట్ మొత్తం సీ వ్యూవ్ కావడంతో ఏరి కోరి ఈ దంపతులు ఇక్కడ అద్దెకు ఉన్నట్టు సమాచారం. ఇలా సముద్రపు అందాలను తిలకిస్తూ లక్షల్లో అద్దె చెల్లిస్తూ ఈ దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.ఇకపోతే వివాహం అనంతరం ఈ దంపతులు ఓ కుమార్తెకు జన్మనివ్వగా అనుష్క శర్మ కూతురు పుట్టినప్పటినుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ కూతురు ఆలనా పాలన చూసుకుంటున్నారు.