వైరల్ : “గేమ్ చేంజర్”, “ఇండియన్ 2” లపై శంకర్ అప్డేట్స్.!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లలో హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రాలు ఎలా ఉన్నాయో అలాగే దర్శకుడు శంకర్ చేస్తున్న చిత్రాలు కోసం కూడా పాన్ ఇండియా ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో భారీ చిత్రం “గేమ్ చేంజర్” అలాగే ఉలగనయగన్ కమల్ హాసన్ తో అయితే భారీ చిత్రం “ఇండియన్ 2” తాను చేస్తున్నారు. కాగా ఒకో సినిమాని చాలా ఫోకస్డ్ గా తీస్తూ వస్తున్న శంకర్ భారీ హంగులతో దేనికదే అన్న రీతిలో ప్లాన్ చేస్తున్నారు.

మరి ఈ చిత్రాల నుంచి ఈ ఇండిపెండెన్స్ డే కానుకగా రెండు అప్డేట్స్ ని వరుసగా ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది. మొదటగా అయితే చరణ్ గేమ్ చేంజర్ సెట్స్ నుంచి తనది ఇంట్రెస్టింగ్ పిక్ రిలీజ్ చేశారు. కాగా ఇందిలో బ్యాక్గ్రౌండ్ లో గాంధీజీ ఫోటో దాని ముందు తాను సీన్ పేపర్ పట్టుకుని చదువుతున్నట్టుగా అప్డేట్ అందించగా ఈ వెంటనే మరో ప్రాజెక్ట్ “ఇండియన్ 2” నుంచి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ఇందులో నుంచి అయితే ఏకంగా కమల్ హాసన్ చేస్తున్న సేనాపతి లుక్ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసి విషెస్ తెలిపారు. దీనితో ఈ రెండు సడెన్ అప్డేట్స్ అయితే ఈ స్పెషల్ డే కి ట్రీట్ గా మారాయి. ఇక ఓ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఓ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కి రానున్నాయి.