వైరల్ : హాలీవుడ్ లెవెల్లో పెద్ద ప్లానే వేసిన రామ్ చరణ్??

టాలీవుడ్ అండ్ ఇండియన్ సినిమా ప్రైడ్ గా నిలిచిన చిత్రం “ఆర్ ఆర్ ఆర్” తో హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల ఫేమ్ వరల్డ్ వైడ్ గా మారిపోయింది. మెయిన్ గా రామ్ చరణ్ కే అయితే మరింత ఫేమ్ వచ్చింది అని చెప్పొచ్చు. మరి అలా హాలీవుడ్ టాప్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ సైతం రామ్ చరణ్ రోల్ కి RRR లో ఇంప్రెస్ అవ్వగా మెగా ఫ్యాన్స్ కి చరణ్ ఎప్పటికపుడు ఈ సినిమా తర్వాత నుంచి గట్టి హై ఇస్తున్నాడు.

ఇక ఇదిలా ఉండగా ఆ మధ్యనే రామ్ చరణ్ ని పలు హాలీవుడ్ సంస్థలు సంప్రదించాయి అని హాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి అని టాక్ వచ్చింది. చరణ్ కూడా వీటిపై పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఓ షేకింగ్ న్యూస్ అయితే వైరల్ గా మారింది నిన్న రాత్రి సమయంలో ప్రపంచ పాపులర్ ఓటిటి సంస్థ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సెరండోస్ రామ్ చరణ్ ని కలవడం బిగ్ థింగ్ గా మారింది.

దీనితో ఈ మీటింగ్ ఖచ్చితంగా ఓ మెగా ప్రాజెక్ట్ కోసం కూడా కావచ్చని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ రామ్ చరణ్ తో ఏదన్నా ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ కి డీల్ కూడా కుదుర్చుకొని ఉండొచ్చని కొందరు అంటున్నారు. అయితే రామ్ చరణ్ ని ఏంటి నెట్ ఫ్లిక్స్ సీఈఓ కలవడం ఏంటి అనేది మాత్రం ఒక ఊహించని అప్డేట్ గా మారగా అసలు ఎందుకు కలిశారు ముందు రోజుల్లో ఎలాంటి అనౌన్సమెంట్ లు వస్తాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.