తూచ్.. నా స్టేట్మెంట్ తప్పుగా అర్థం చేసుకున్నారు.. తన రిటైర్మెంట్ పై వివరణ ఇచ్చిన విక్రాంత్ మాస్సే!

బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ఇటీవల తన ఇన్స్టా లో తన సినిమా కెరియర్ కి రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకి షాక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తనకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు కూడా తెలిపాడు. భర్తగా తండ్రిగా కొడుకుగా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది, 2025లో వచ్చే సినిమాతో మనం చివరిసారిగా కలుద్దాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఇతను చివరిగా నటించిన సినిమా ది సబర్మతి రిపోర్ట్ మూడువారాల క్రితం విడుదలై మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో ఈ స్టార్ నటుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి అంటూ సినీ ప్రపంచం షాక్ అయింది. ఆయన ఫ్యాన్స్ అయితే తెగ హర్ట్ అయిపోయారు మీకోసం వెయిట్ చేస్తాం అని కొందరు త్వరగా తిరిగి రండి అని కొందరు కామెంట్స్ కూడా చేశారు. అయితే విక్రాంత్ మాస్సే రిటైర్మెంట్ ప్రకటించిన రెండు రోజులు కాకముందే ఓ మూవీ షూటింగ్ సెట్లో దర్శనమిచ్చాడు.

ప్రస్తుతం డెహ్రాడూన్ లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొన్నారు. తన తర్వాత చిత్రం ఆంకోన్ కి గుప్తా ఖియాన్ షణాయ కపూర్ తో కలిసి నటిస్తున్నాడు. దీంతో మరింత షాక్ అయ్యారు అతని ఫ్యాన్స్. అయితే ఈ విషయంపై సదరు నటుడు స్పందిస్తూ తన స్టేట్మెంట్ కి సంబంధించిన వివరణ ఇచ్చాడు. నా స్టేట్మెంట్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను నటన నుండి రిటైర్ అవడం లేదు, నా శారీరక మరియు మానసిక ఆరోగ్యం దెబ్బతింది నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొంత సమయం కేటాయించాలి అనుకున్నాను.

నేను ఈ సమయంలో మార్పులేని అనుభూతిని అనుభవిస్తున్నాను. నా కుటుంబం మరియు ఆరోగ్యం పై దృష్టి పెట్టడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాను, సరైన సమయం వచ్చినప్పుడు నేను తిరిగి వస్తాను అంతేకానీ సినిమాల నుంచి వైదొలగను అని తన అభిమానులకి భరోసా ఇచ్చాడు.