అతని వల్లే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ పై టబూ వైరల్ కామెంట్స్!

ఒకప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ఇప్పటికీ పెళ్లి లేదు అంటే ఏదో పెద్ద కారణమే అని అంతా అనుకుంటారు. అందం, ఆస్తి పాస్తులు, పేరు ప్రతిష్టలు అన్నీ ఉండి కూడా ఆ నటి ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు. ఈమె వయసు 50 దాటుతున్నా పెళ్లి ఊసే లేదు. ఈ వయసులో కూడా ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. కుర్ర హీరోయిన్లను కూడా డామినేట్ చేసేలా ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తుంది ఇప్పటికే సగం వయసు దాటిపోయింది ఇకపై చేసుకుంటారా అన్నది సందేహమే.

ఇంత ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఎప్పటికైనా గుర్తుపట్టారా ఆమెనండి కూలి నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అందాల తార టబు. ఆమెకి ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడంపై అనేక వార్తలు వినిపిస్తున్నప్పటికీ తాజాగా ఈ విషయంపై టబు కూడా స్పందించింది. నేను పెళ్లి చేసుకోకపోవటానికి కారణం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ అంటూ బాంబు పేల్చింది.అజయ్ దేవగణ్ నాకు.. 13 ఏళ్ళ వయసు నుండే తెలుసు. అతను నా సోదరుడి(సమీర్) చిన్ననాటి స్నేహితుడు. జుహూలో మేమంతా కలిసి పెరిగాం.

అప్పట్లో వాళ్ళు ఓ గ్యాంగ్ ను కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. మేము వాళ్ళను అప్పుడప్పుడు సరదాగా ఆటపట్టించేవాళ్ళం. నాతో ఏ అబ్బాయి అయినా మాట్లాడడానికి ట్రై చేస్తే.. అజయ్, సమీర్ లు.. వాళ్ళను చితక్కొట్టేవారు. దాంతో ఏ అబ్బాయి నాతో మాట్లాడే వాడు కాదు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు సింగిల్ గా మిగిలిపోయాను అంటూ సరదాగా ముగించేసింది.

నాకు మంచి వరుడుని చూడమని అజయ్ కి కూడా చెప్పాను అతనికి కూడా తెలుసు నాకు ఒక పట్టానా ఏది అంత త్వరగా నచ్చదని అని చెప్పుకొచ్చింది టబు. అయితే ఆమె హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరో తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఎక్కడికక్కడ మీడియా కంట పడుతూ నిత్యం వార్తల్లో ఉండేవారు ఈ జంట. అయితే ఆ హీరోకి పెళ్లి అయిపోవడంతో వాళ్ళ ప్రేమ కథకి ఫుల్ స్టాప్ పడిన విషయం అందరికీ తెలిసిందే.