విజయ్ కుమార్తె బ్యాడ్మింటన్ ఛాంపియన్.. అంతేకాదు ఈ సినిమాలో నటించింది కూడా!

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న విజయ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ మధ్యనే గోట్ సినిమాతో మన ముందుకు వచ్చిన విజయ్ ఈ మధ్యనే రాజకీయాలలోకి వెళ్లారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే చివరి సినిమాగా ఇప్పుడు విజయ్ 69 వర్కింగ్ టైటిల్ తో హెచ్ వినోద్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ తో పాటు పూజా హెగ్డే, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, బాబి డియోల్, మమత బైజు, నరేన్ తదితరులు నటిస్తున్నారు.

ఇక సినిమా విషయాలు పక్కన పెట్టి విజయ్ పర్సనల్ విషయాలకి వస్తే తన కుటుంబం గురించి పెద్దగా ఎక్కడా మాట్లాడడు. విజయ్ కి భార్య సంగీత, కొడుకు జోసెఫ్ సంజయ్, కూతురు దివ్య నాషా ఉన్నారు. తనయుడు జోసెఫ్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా సినీరంగంలో రాణిస్తున్నాడు. ఇక కూతురు దివ్య నాషా తేరి చిత్రంలో తండ్రి తో పాటు నటించింది. అయితే విజయ్ కూతురు దివ్య సాషా మంచి బ్యాడ్మింటన్ ఛాంపియన్.

ఈ విషయాన్ని విజయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు . దివ్య సాషా.. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్. స్కూల్లో జరిగే టోర్నమెంట్‌లో మొదటి స్థానాల్లో నిలిచింది. ఆమె మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అని చెప్పుకొచ్చాడు విజయ్ ఆ ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో లభించేవి కానీ దివ్య సాషా సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ప్రస్తుతం విజయ్ కూతురికి సంబంధించిన ఫోటోస్ ఎక్కడా కనిపించడం లేదు. ఇక విజయ్ భార్య సంగీత విషయానికి ఆమె పెళ్లికి ముందు విజయ్ కి వీరాభిమాని.

తర్వాత ఆమెనే పెళ్లి చేసుకుని భార్యని చేసుకున్నాడు విజయ్. 1999లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. అయితే ఇప్పుడు వారిద్దరి వైవాహిక జీవితానికి బీటలు ఏర్పడ్డాయి అంటున్నారు ఆయన ఫ్యాన్స్. విజయ్ ఈమధ్య భార్యని దూరం పెట్టి ఒక స్టార్ నటితో తిరుగుతున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఈ మధ్యనే జరిగిన కీర్తి సురేష్ పెళ్లికి కలిసి వెళ్లి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ విషయంలో మాత్రం అందరి సపోర్టు సంగీత వైపే ఉండటం గమనార్హం.