ట్రైలర్ టాక్ : విజయ్ “వారసుడు” ఏదో తేడాగా వుందే..!

తమిళ నాట భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రమే “వారసుడు”. తమిళ నాట మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి అంచనాలు ఉండడం విశేషం కాగా ఫైనల్ గా అయితే ఈ సినిమా నుంచి నేరుగా ట్రైలర్ నే చిత్ర యూనిట్ విడుదల చేశారు.

మరి తమిళ్ మరియు తెలుగు థియేట్రికల్ ట్రైలర్ లను ఈరోజే ఒకే సమయంలో రిలీజ్ చేయగా వీటికి భారీ రెస్పాన్స్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ ట్రైలర్ చూసినట్టు అయితే తెలుగులో విజయ్ రొటీన్ డబ్బింగ్ లోనే ఉంది. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి అయితే ఫామిలీ ఎమోషన్స్ ని బాగా పట్టుకున్నారని చెప్పొచ్చు.

కానీ సినిమాలో కనిపిస్తున్న టెంప్లెట్ చాలా రొటీన్ గానే ఉందని చెప్పాలి. ముగ్గురు అన్నదమ్ములు ఉన్న ఫామిలీ లో మూడో కొడుకు దూరంగా ఉండడం తర్వాత ఫామిలీ కి ఆపద వస్తే తాను వచ్చి ఎలా సేవ్ చేస్తాడు అనేది ఇందులో కథలా కనిపిస్తుంది.

అయితే ఇలాంటి లైన్ లలో చాలానే సినిమాలు వచ్చేసాయి. దీనితో ఈ ట్రైలర్ కాస్త రొటీన్ గానే అనిపించింది. కానీ విజయ్ ని మాత్రం వంశీ బాగా ప్రెజెంట్ చేశారు. తమిళ్ నేటివిటీ తక్కువ ఉండడం తెలుగులో ప్లస్ కావచ్చు. అలాగే మధ్యలో రష్మికా ట్రాక్ కూడా రొటీన్ గానే ఉంది.

అయితే ఇందులో థమన్ ఇచ్చిన స్కోర్ మరో ప్లస్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా అయితే ఓ రొటీన్ రెగ్యులర్ ఫామిలీ అండ్ ఏక్షన్ డ్రామాలా వారసుడు కనిపిస్తున్నాడు. మరి థియేటర్స్ లో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అది తెలియాలి అంటే ఈ సంక్రాంతి వరకు ఆగాలి.
Vaarasudu Official Trailer | Thalapathy Vijay | Rashmika | Vamshi Paidipally | Dil Raju