ఇండస్ట్రీ టాక్ : విజయ్ సినిమా ఆ రెండు క్రేజీ కాన్సెప్ట్స్ లో ఒకటిగా??

ప్రస్తుతం తమిళ సినిమా నాట సహా సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా మంచి వైరల్ గా వినిపిస్తున్న సినిమా పేరు “గోట్”. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తన కెరీర్ లో 68వ సినిమాగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రం నుంచి కొత్త సంవత్సరం కానుకగా అయితే క్రేజీ ట్రీట్ ఇస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ సహా రెండో పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

అయితే ఈ రెండిట్లో కూడా విజయ్ డబుల్ రోల్ అందరిలో ఆసక్తి రేపింది. దీనితో అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది ప్రశ్నగా మారింది. కాగా ఇపుడు సినీ వర్గాల్లో రెండు క్రేజీ కాన్సెప్ట్ లు వైరల్ గా మారాయి. మొదటిది అయితే సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ లో కనిపిస్తుంది అని అలా ఇద్దరు విజయ్ లు కలిస్తే ఎలా ఉంటుందో అనేది చూపిస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇక మరొకటి ఏమిటంటే ఇది హాలీవుడ్ సినిమా “జెమినీ మాన్” తరహాలో ఒక క్లోన్ లాంటి విజయ్ పాత్రని తనకి డబుల్ గా సినిమాలో సృష్టిస్తారు అని అది కూడా విజయ్ శక్తి సామర్ధ్యాలతో ఉంటాడు అలా అక్కడ నుంచి కాన్సెప్ట్ తీసుకున్నారని అంటున్నారు. మరి దీనితో ఈ రెండు క్రేజీ కాన్సెప్ట్ లో ఒకటిగా వెంకట్ ప్రభు చూపిస్తాడని తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి చూడాలి ఎలా ఈ సినిమా ఉండబోతుంది అనేది.