లేటెస్ట్ : విజయ్ “గోట్” నుంచి మరో స్టన్నింగ్ పోస్టర్.. 

తమిళ సినిమా నాట భారీ స్టార్డం ఉన్నటువంటి బిగ్ స్టార్స్ లో దళపతి విజయ్ కూడా ఒకడు. కాగా విజయ్ ఇప్పుడు అంతకంతకు తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. కాగా రీసెంట్ గానే విజయ్ తన కెరీర్ 67వ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో “లియో” గా చేసి తన కెరీర్ లోనే కాకుండా తమిళ సినిమా దగ్గరే రెండో అతిపెద్ద గ్రాసర్ గా అయితే అందుకున్నాడు.

ఇక దీని తర్వాత మరో టాలెంటెడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తో తన కెరీర్ 68వ సినిమా సినిమా లాక్ చేయగా నిన్ననే దీని నుంచి ఫస్ట్ లుక్ సహా సినిమా టైటిల్ ని కూడా రివీల్ చేయగా దానికి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ చేస్టున్నట్టుగా ఆ పోస్టర్ చూస్తే అనిపించింది.

“గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అంటూ రిలీజ్ చేసిన ఈ మాసివ్ పోస్టర్ తర్వాత ఇప్పుడు మేకర్స్ రెండో పోస్టర్ ని రిలీజ్ చేశారు. కాగా ఈ పోస్టర్ దానికి మించి హాలీవుడ్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇద్దరు విజయ్ లు బైక్ మీద కనిపిస్తూ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నట్టుగా ఈ పోస్టర్ చూస్తే అనిపిస్తుంది.

ఇక్కడ కూడా మళ్ళీ యంగ్ ఏజ్ విజయ్ తో పాటుగా మిడిల్ ఏజ్ విజయ్ లు కూడా కనిపిస్తున్నారు. దీనితో ఈ రెండో పోస్టర్ కి మొదటి పోస్టర్ ని మించి రెస్పాన్స్ వస్తుంది. కాగా దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు అని కొన్ని రూమర్స్ ఉన్నాయి. అందుకే ఇంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నేపథ్యం ఏంటి అనేది వేచి చూడాలి.