ప్రస్తుతం తమిళ నాట భారీ ఎత్తున సంచలనం రేపుతున్న చిత్రం “లియో”. స్టార్ హీరో విజయ్ మరియు దర్శకుడు లోకేష్ కనకరాజు ల కాంబినేషన్ లో తెరకెక్కించిన రెండో సినిమా ఇది కావడం అలాగే ఈ సినిమా లోకేష్ సినిమా యూనివర్స్ లో భాగమైన సినిమా కావడంతో అయితే ఓ రేంజ్ లో అంచనాలు స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యింది ఈ చిత్రం.
ఇక అంచనాలు ఆల్ మోస్ట్ అందుకున్న ఈ సినిమా భారీ వసూళ్లు అందుకొని తమిళ నాట సంచలన రికార్డులు అందుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిలీజ్ కి ముందే ఈ సినిమా కేవలం నాలు వారాల్లోనే ఓటిటి లో వచ్చేస్తుంది అనేది కన్ఫర్మ్ అయ్యింది.
కాగా ఇప్పుడు ఈ రిలీజ్ విషయంలో ఓ రూమర్ వైరల్ గా మారింది. రీసెంట్ గా బాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన ట్రెండ్ లో భాగంగా ఓటిటి లో లియో చిత్రాన్ని అదనపు సీన్స్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మళ్ళీ ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ కి మరియు ఓటిటి వెర్షన్ కి కూడా చాలా తేడాలు ఉంటాయని కూడా అంటున్నారు.
మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. ఇక ఈ సినిమాలో అర్జున్ సార్జా, సంజయ్ దత్ లు నటించగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. అలాగే అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించిన విషయం తెలిసిందే.