ఈ ఏడాది తమిళ సినిమా దగ్గర సెన్సేషనల్ రికార్డ్స్ సెట్ చేసి భారీ హిట్ అయ్యిన సినిమాలో విజయ్ నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అప్పటికే వారిసు సినిమాతో విజయ్ తన కెరీర్ లోనే పెద్ద హిట్ కొట్టాడు అనుకుంటే దానిని కాస్తా జస్ట్ మూడు రోజుల్లో క్రాస్ చేసేసి “లియో” తో డబుల్ మార్జిన్ గ్రాసర్ ని తాను అందుకున్నాడు.
దీనితో లియో సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఎమెర్జ్ అవ్వగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కూడా ఫిక్స్ చేసినట్టుగా నిన్ననే నెట్ ఫ్లిక్స్ బిగ్ అప్డేట్ అందించింది. అయితే ఈ అప్డేట్ ప్రకారం రెండు తేదీలలో ఈ సినిమా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
మొదటగా 24 నవంబర్ ఇండియా లో తర్వాత 28 నవంబర్ గ్లోబల్ గా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే దీనిపై నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ లు గమనిస్తే ఇండియా వెర్షన్ పోస్టర్ ప్లైన్ గా ఉండగా గ్లోబల్ పోస్టర్ మాత్రం ఏక్షన్ అంశాలతో కనిపిస్తుంది.
అంటే గ్లోబల్ వెర్షన్ లో “లియో” సెన్సార్ లేని కట్ తో వస్తే ఇండియా లో మాత్రం కట్ చేసిన వెర్షన్ రాబోతున్నట్టుగా అర్ధం అవుతుంది. దీనితో ఈ చిత్రం సెన్సార్ లేని వెర్షన్ కోసం ఎదురు చూస్తున్న ఇండియా ఫ్యాన్స్ కి మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి తర్వాత ఏమన్నా దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
The wait is finally over!! We have some Bloody Sweet news for you. :chocolate_bar: Naa Ready! Are you?:fire:#Leo is coming to Netflix on 24th Nov in India and 28th Nov Globally in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi. pic.twitter.com/zkiPFmGRaJ
— Netflix India South (@Netflix_INSouth) November 20, 2023