ఇప్పుడు తమిళ సినిమా దగ్గర సెన్సేషనల్ హైప్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా తలపతి విజయ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “లియో” అనే చెప్పాలి. విజయ్ డ్యూయల్ రోల్ లో చేస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించాడు.
అయితే పాన్ ఇండియా వైడ్ గా విజయ్ గత అన్ని చిత్రాల కంటే ఎంతో అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా విషయంలో అంతా పాజిటివ్ గానే ఉన్నా ఈ సినిమా ఓటిటి రిలీజ్ మాత్రం ఇప్పుడు కేజ్రీగా మారింది. ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన జస్ట్ ఒక్క నెల లోనే ఓటిటి లో రావడం అనేది ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది.
ఎందుకంటే ఈ చిత్రం హిందీ వెర్షన్ విషయానికి వస్తే ఓటిటి డీల్ కేవలం నాలుగు వారాలు మాత్రమే ఉందని అందుకే నేషనల్ మల్టిప్లెక్స్ లో అయితే లియో కి స్క్రీన్ లు ఇవ్వలేదు. దీనితో లియో మేకర్స్ సొంతంగా సింగిల్ స్క్రీన్స్ లోనే రిలీజ్ చేసుకుంటున్నారు. అంటే దీని ప్రకారం ఈ చిత్రం కేవలం నెల లోపలే ఓటిటిలో వచ్చేస్తుంది అని చెప్పొచ్చు.
అంతే కాకుండా రీసెంట్ గా తమిళ్ సినిమాలు చూసుకున్నా జైలర్, విజయ్ నటించిన గత రెండు సినిమాలు కూడా ఇలా తక్కువ వ్యవధిలోనే వచ్చేసాయి. సో ఇంత హైప్ ఉన్న లియో కూడా అంత తొందరగా ఓటిటీలో వచ్చేసినా ఆశ్చర్యం లేదు. ఈ లెక్కన చూస్తే అక్టోబర్ 19న విడుదల అవుతున్న ఈ చిత్రం ఆ వచ్చే నెల నవంబర్ మధ్యలో నెట్ ఫ్లిక్స్ లో వచ్చేయవచ్చు.