Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన మూవీ కూలీ. ఈ సినిమా కోసం చాలా రోజుల పాటు కష్ట పడ్డారు రజినీకాంత్. అలాగే లోకేష్ కూడా రెండేళ్లుగా స్నేహితులు, సరదాలను పక్కనపెట్టి కేవలం కూలీ మూవీ కోసమే నిరంతరం శ్రమించారు. ఇదే విషయాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు లోకేష్.
అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా నాకు కూలీ తప్ప మరే ధ్యాస లేదు. కుటుంబం, స్నేహితులు, సరదాలు ఏమీ లేవు. నా మొత్తం దృష్టంతా సినిమా పైనే ఉంది. ఆఖరికి 36, 37 సంవత్సరాల పుట్టిన రోజులను కూడా జరుపుకోలేదు. నెలల తరబడి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను రజనీ సర్ సినిమా విషయంలో కొంచెం కూడా నేను పరధ్యానంతో ఉండకూడదనుకున్నాను. ఈ కథ, సినిమాకు నేను అంతలా వశమైపోయాను అని లోకేశ్ కనగరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా విక్రమ్ భారీ విజయం తర్వాత విజయ్ కథానాయకుడిగా వచ్చిన లియో ఆ స్థాయి మేజిక్‌ను చేయలేకపోయింది. ఇదే విషయాన్ని లోకేశ్ కూడా ఒక సందర్భంలో ఒప్పుకొన్నారు. వేగంగా సినిమాను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో చాలా విషయాలను పట్టించుకోలేదని తెలిపారు. అయితే లియో విషయంలో జరిగిన తప్పు కూలీ సినిమా విషయం పునరావృతం చేయకూడదన్న నిశ్చయంతో లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు లోకేష్. మరి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి మరి.
