లేటెస్ట్ : గ్రేటెస్ట్ టైటిల్ తో “విజయ్ 68″వ సినిమా.. 

సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ కూడా ఒకడు. మరి ఎప్పుడో అనేక రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చిన విజయ్ ఇప్పుడు కేవలం స్ట్రైట్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర తనకంటూ బిగ్గెస్ట్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు.

దానికి నిదర్శనంగా లేటెస్ట్ గా వచ్చిన “లియో” సినిమాకి ఏకంగా 600 కోట్ల ప్లస్ వసూళ్లు వచ్చాయి. దీనితో విజయ్ నెక్స్ట్ సినిమా 68వ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్ నెలకొనగా ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు వెంటబ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఎప్పుడు నుంచో షూటింగ్ జరుపుకుంటూ ఉండగా చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ సహా సినిమా టైటిల్ ని కూడా రివీల్ చేసేసారు.

కాగా ఈ చిత్రానికి ఒక యూనిక్ టైటిల్ “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”(GOAT) అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. గత కొన్ని రోజులు నుంచి ఇది ప్రచారం లో ఉండగా దీనిని ఇపుడు వారు అఫీషియల్ గా లాక్ చేశారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో చూస్తే విజయ్ రెండు లుక్స్ కనిపిస్తున్నాయి. బహుశా తండ్రి కొడుకులు లేదా ఒకడే విజయ్ రెండు టైం లైన్స్ లో అన్నట్టుగా కనిపిస్తున్నాడు.

దీనితో ఈ పోస్టర్ కి సోషల్ మీడియాలో సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అనే ఇతర వివరాలు ఇంకా రావాల్సి ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు అలాగే ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు.