‘ఫ్యామిలీ స్టార్‌’ విజయ్‌ దేవరకొండ !

‘రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ‘గీతగోవిందం’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్‌ ఠాకూర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తుండగా.. ఎస్‌వీసీ బ్యానర్‌లో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమా ఏప్రిల్‌ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ షూరు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు విజయ్‌ దేవరకొండ. త్వరలోనే టీజర్‌ రానుంది అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్‌గా, బయట రౌడీల బెండు తీసే పవర్‌ఫుల్‌ మ్యాన్‌గా విజయ్‌ దేవకొండ కనిపించనున్నారు. కూల్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ కేయూ మోహనన్‌, సంగీతం: గోపీ సుందర్‌.

విజయ్‌ దేవరకొండ మరోవైపు ‘జెర్సీ’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో కూడా నటించనున్నాడు పోలీస్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా.. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.