ఆ బిగ్ ప్రాజెక్ట్స్ తో పోటీకి విజయ్ దేవరకొండ రిస్క్ చేస్తున్నాడా..?

ఒకే ఒక్క సినిమా ఏ హీరోని అయినా ఒక్క రాత్రి లోనే స్టార్ ని చేసేస్తోంది. ఇక అక్కడ నుంచి వారు ఎలా ఎదిగారు అనేది ఇంకా మళ్ళీ ఆ హీరో టేకప్ చేసే సినిమాల్లోనే ఉంటుంది. మరి అలా అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయినటువంటి హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకడు.

మరి ఈ యంగ్ హీరో ఈ పాన్ ఇండియా సినిమా దగ్గర కూడా మంచి స్టేటస్ తీసుకొని ఇప్పుడు లైగర్ అనే భారీ సినిమా తో రెడీగా ఉన్నాడు. మరి దీని తర్వాత మరో రెండు సినిమాలు కూడా స్టార్ట్ చేసిన విజయ్ అందులో ఓ సినిమాని భారీ పోటీ మధ్య దింపుతున్నట్టు తెలుస్తుంది.

ఐతే ఆ సినిమా దర్శకుడు శివ నిర్వాణ మరియు సమంత నటిస్తున్న సినిమా “ఖుషి” అట. ఈ సినిమాపై అయితే లైగర్ తో పోలిస్తే చాలా తక్కువ బజ్జే ఉంది. మరి ఇలాంటి సినిమా ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట. అక్కడ అసలే ఆదిపురుష్, చిరు 154వ సినిమా..

అలాగే బాలయ్య నటిస్తున్న భారీ మాస్ చిత్రం ఎన్ బి కె 107 సహా విజయ్ దళపతి నటిస్తున్న “వారిసు” కూడా ఉంది. మరి ఇలాంటి బిగ్ స్టార్స్ సినిమాలు ఉన్నపుడు విజయ్ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. మరి ఈ టాక్ నిజమైతే బిగ్ రిస్క్ అనే చెప్పాలి. అలాగే విజయ్ సినిమా పరిస్థితి ఏంటో కూడా చూడాలి.