విజయ్ దేవరకొండ ‘లైగర్’ బడ్జెట్ ఎంతంటే?

టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ పూరి జగన్నాధ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సోమవారం సినిమాకి సంబంధించిన టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. లైగర్ అనే టైటిల్ తోనే పూరి అభిమానులకు మంచి కిక్కిచ్చాడు.

అయితే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో టైటిల్ ఫస్ట్ లుక్ తోనే అర్ధమయ్యింది. అభిమానులు అప్పుడే కటౌట్స్ క్రియేట్ చేసి బీర్లాభిషేకం చేస్తున్నారు. ఇక సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సినిమా బడ్జెట్ పై గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఫైనల్ గా సినిమా బడ్జెట్ మొత్తం రూ.110కోట్ల వరకు అవుతోందట.

పూరి జగన్నాథ్ హోమ్ ప్రొడక్షన్ పూరి కనెక్ట్స్ లో ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా పాట్నర్ అయ్యారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అవుతోంది. మరి సినిమా విడుదల తరువాత ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.