మరో రేర్ రికార్డు సృష్టించిన రౌడీ !

విజయ్ దేవరకొండ సినిమాల విషయంలోనే కాదు.. సోషల్ మీడియాలో మంచి దూకుడు మీదున్నాడు. విజయ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఈ సినిమాతో యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు విజయ్. తనదైన ఆటీట్యూడ్‌తో.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ..మంచి నటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్నాడు.

 

తాజాగా విజయ్ దేవరకొండ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌత్‌లో ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండను 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్‌లో విజయ్ దేవరకొండ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నా.. విజయ్ …ఈ రికార్డు అందుకోవడం విశేషం.

కాగా ఈ రికార్డు సాధించిన నేపథ్యంలో విజయ్ ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నాడు. పదిమందికి అయినా.. అంతే లవ్ అని 100 మందికి అయినా తాను చూపించే లవ్ అంతేనని.. తాజాగా కోటి మందికి అయినా ఆ ప్రేమ తగ్గదని కొంత భావోద్వేగంతో రాశాడు. దీంతో తన ఫాలోవర్స్ కూడా భావోద్వేగం అవుతూ.. లవ్ యూ విజయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.