పాపం పూజాని మిస్ అవ్వకూడదు అనుకుంటున్న విజయ్.?

vijay-deverakonda

ఇప్పుడు టాలీవుడ్ సినిమా సహా ఇండియా లో ఏ సినిమా దగ్గర కూడా అంతగా పరిస్థితి బాగాలేని హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. మరి మరి వరుస హిట్స్ తో భారీ హిట్స్ అందుకున్న ఈమె మళ్ళీ మోస్ట్ ఎలిజిబుల్ బాచ్ లర్ తర్వాత అయితే ఇక హిట్ చూడలేదు.

తెలుగు తమిళ్ సహా హిందీ లలో కూడా భారీ డిజాస్టర్ లు చూసిన పూజా ఇప్పటికి కొన్ని సినిమాలు ఐతే చేస్తుంది. కాగా పూజా ఓకే చేసిన లైనప్ లో అయితే ఆ మధ్య రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ లతో అనౌన్స్ అయ్యిన చిత్రం “జనగణమన” కూడా ఒకటి.

మరి ఈ సినిమా లైగర్ డిజాస్టర్ తో పక్కకి వెళ్లిపోగా పూజా హెగ్డే కి మాత్రం విజయ్ ఓ ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడట. ఇపుడు తనకి ఉన్న లైనప్ లో తన హిట్ దర్శకుడు పరశురామ్ పెట్ల తో అయితే చేయనున్న నెక్స్ట్ సినిమాలో పూజా హెగ్డే ని పెట్టుకుందాం అని డైరెక్టర్ కి నిర్మాతలకి సజెస్ట్ చేస్తున్నాడట.

జనగణమణ ఆగిపోయింది కాబట్టి తాను ఆమె పేరును సజెస్ట్ చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. ఇప్పటికీ పూజాకి హిట్ లేవు మరి ఈమెని నిర్మాతలు పెట్టుకునే సాహసం చేస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఇపుడు విజయ్ అయితే ఖుషి సినిమాలో బిజీగా ఉన్నాడు.