ఇప్పుడు సమంత లైఫ్ లో కొత్త అధ్యాయం..కొత్త బ్యానర్ స్టార్ట్..!

సౌత్ ఇండియా సహా పాన్ ఇండియా మార్కెట్ లో కూడా ఇప్పుడు మంచి ఫేమ్ ఉన్న అతి కొద్దీ మంది సౌత్ హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ సమంత కూడా ఒకామె. కాగా ఇప్పుడు సమంత సినిమాలు సిరీస్ లకి కూడా బ్రేక్ ఇచ్చింది. లాస్ట్ గా ఖుషి సినిమాలో కనిపించిన ఆమె మళ్ళీ ఇంకెక్కడా కనిపించలేదు.

ఆఫ్ లైన్ లో మాత్రం ఏదొకలా సందడి చేస్తున్న సమంత ఇపుడు ఒక నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత ఇప్పుడు తన లైఫ్ లో అయితే కొత్త అధ్యాయం స్టార్ట్ చేసింది. కాగా ఆమె ఇప్పుడు నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారింది. మారడమే కాకుండా ఓ కొత్త బ్యానర్ ని స్టార్ట్ చేసినట్టుగా ఇప్పుడు సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశారు.

కాగా ఈమె “ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్” అనే సరికొత్త బ్యానర్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా సినిమాలు తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం బయటకి వచ్చింది. దీనితో సమంత ఇక నుంచి ప్రొడ్యూసర్ గా కూడా మారింది అని చెప్పాలి. మరి ఈ బ్యానర్ తో ప్రొడ్యూసర్ గా కూడా ఆమె ఏమన్నా నిలదొక్కుకుంటుందో లేదో అనేది వేచి చూడాలి. ఇంకా ఆమె బ్యానర్ లో మొదటి సినిమా ఏది ఏ భాషలో చేస్తుందో అనే ఇతర వివరాలు మాత్రం ఇంకా బయటకి రావాల్సి ఉంది.