ఒక టైం లో అయితే టాలీవుడ్ సినిమా దగ్గర కొన్ని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అయితే అక్కినేని యూన్ హీరో నాగ చైతన్య మరియు హీరోయిన్ సమంత ల కాంబినేషన్ ఒకటి కూడా అని చెప్పేవాళ్ళు. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు తర్వాత మనస్పర్థలు మూలాన విడాకులు తీసుకున్నారు.
తర్వాత ఇద్దరు కూడా చాలా సార్లు ఇబ్బందులు పడ్డారు కానీ సమంత పై మరింత ఎఫెక్ట్ పడింది. కానీ సమంత కొన్ని సందర్భాల్లో ఇచ్చిన సమాధానాలు కూడా చాలా మందికి నచ్చలేదు. ఇక ఇది పక్కన పెడితే ప్రొఫిషనల్ గా బిజీగా మారిపోయిన సమంత నెక్స్ట్ ఇప్పుడు మరిన్ని ప్రాజెక్ట్ లు చేస్తుంది.
అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ కాగా ఆమెకి రెండో పెళ్లి ప్రశ్న ఎదురైంది. అయితే దీనిపై సమంత ఓపెన్ అయ్యింది. రెండు పెళ్లి చేసుకునే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అని నెటిజన్ ఆమెని అడగ్గా ఆమె అందుకే ఫన్ ఆన్సర్ ఇచ్చింది.
ఇండియాలో మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి మూడో పెళ్లిలకే విడాకుల రేటు ఎక్కువగా ఉన్నాయని సో అంత ఇన్వెస్ట్ చేయడం నా వల్ల కాదని చెప్పింది. దీనితో తనకి రెండో పెళ్లి చేసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదని చెప్పకనే చెప్పేసింది. దీనితో ఈమె సమాధానం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.