సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన లేటెస్ట్ చిత్రం “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోడం వసూళ్లు రాబట్టలేకపోవడం ఏమో కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్మాత ఛార్మి లకు మాత్రం తీరని తలనొప్పి తీసుకొచ్చి పెట్టింది.
సినిమా నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయని ఏకంగా ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళే చిత్ర యూనిట్ ని నిన్న హీరో విజయ్ దేవరకొండ ని కూడా పిలిపించి మాట్లాడ్డం ఆసక్తిగా మారింది. అయితే విజయ్ ని ఈడీ ప్రశ్నించాక తాను ఓ ప్రెస్ మీట్ పెట్టి అయితే అందరికీ క్లారిటీ ఇవ్వడం ఆసక్తిగా మారింది.
మరి తాను తనదైన యాటిట్యూడ్ లో మాట్లాడుతూ ఈడీ వారు వేసిన కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడం జరిగింది అని అయితే ఈ సమయంలో నాకు వచ్చిన ఈ సపోర్ట్ చాలా ఆనందంగా అనిపించింది అని అన్నాడు అలాగే లాస్ట్ లో మళ్ళీ వారు అయితే తాను రావాల్సిన ఆవాసం లేదని కూడా చెప్పినట్టు తేల్చి చెప్పేసాడు. దీనితో విజయ్ క్రేజీ స్పందన మంచి వైరల్ గా మారింది. అలాగే తాను ఇక నెక్స్ట్ కూడా వెళ్లాల్సిన పని లేదు అనే వార్త ఫ్యాన్స్ కి కూడా ఊరటనిచ్చింది.