రష్మికతో పెళ్లి రూమర్స్ పై విజయ్ దేవరకొండ క్లారిటీ.. 

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ జంటలలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నల జంట కూడా ఒకటి. క్కాగా గత కొన్నాళ్ల నుంచి వీరిద్దరి వ్యవహారంపై వారి అభిమానుల్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. వాటిని ఆల్ మోస్ట్ నిజం అన్నట్టే బాలయ్య టాక్ షోలో కూడా రష్మిక ఫోన్ కాల్ విషయంలో దొరికింది.

ఇక వీటి తర్వాత వీరిద్దరి ఎంగేజ్మెంట్ కి సంబంధించి కొన్ని గాసిప్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ ఫిబ్రవరిలో ఇద్దరు నిశ్చితార్థం చేసుకోబోతున్నారని ఆ తర్వాత పెళ్లి అంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ వీటిపై లేటెస్ట్ గా హీరో విజయ్ దేవర కొండ స్పందించాడు.

అసలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొంతమంది ఇలాంటి వార్తలు కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారని ఈ రూమర్స్ నేను ప్రతి ఏడాది వింటూ వస్తున్నాను వాళ్ళు నన్ను పట్టుకొని పెళ్లి చేయాలని చూసున్నారేమో అంటూ వివరణ ఇచ్చాడు. దీనితో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని ప్రస్తుతానికి తాను ఖండించాడు.

ఇక రీసెంట్ గానే విజయ్ నటించిన “ఖుషి” తో హిట్ అందుకోగా ఈ సినిమా తర్వాత ఫామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. అలాగే రష్మిక పుష్ప 2 సహా ఇతర పలు భారీ చిత్రాలు పాన్ ఇండియా భాషల్లో చేస్తుంది.