సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ క్రేజ్ వేరయా.. 

ఇప్పుడు ఉన్న తెలుగు యంగ్ హీరోస్ యూత్ లో అపారమైన క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకడు. అయితే ఎక్కడో అతి చేస్తాడు అని కామెంట్స్ ఉంటాయి కానీ కొన్ని మంచి పనులు కూడా చేస్తూ విజయ్ దేవరకొండ వాటిని మర్చిపోయేలా చేస్తాడు.

అయితే రీసెంట్ గానే విజయ్ నటించిన ఖుషి సినిమా రిలీజ్ సమయంలో ఒక కోటి రూపాయలు ఒకో లక్షల చొప్పున తన అభిమానుల కుటుంబాలకి ఇస్తానని చెప్పింది కూడా కాంట్రవర్సీ చేశారు. ఇది పక్కన పెడితే విజయ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా అందరికీ ఆ డబ్బులు ఇచ్చేసాడు.

మరి ఇలా అంతకంతకు యూత్ లో తన క్రేజ్ పెంచుకుంటూ వెళ్తుండగా విజయ్ కి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది. మెయిన్ గా ఇన్స్టాగ్రామ్ లో అయితే టాలీవుడ్ లో తన కన్నా ముందే ఉన్న బిగ్ స్టార్స్ తో పోటీ క్రేజ్ ఉంది. ఇక రీసెంట్ గా మరో సోషల్ మీడియాలో యాప్ అయినటువంటి వాట్సాప్ లో విజయ్ దేవరకొండ అదరగొట్టాడు.

ఈ యాప్ లో వాట్సాప్ పెద్దలు రోల్ అవుట్ చేసిన ఛానెల్స్ అప్డేట్ తో విజయ్ దేవరకొండ కూడా తన ఛానెల్ ని క్రియేట్ చేసుకోగా ఈ ఛానెల్ కి ఇప్పుడు 10 లక్షలకి పైగా ఫాలోవర్స్ వచ్చారు. దీనితో టాలీవుడ్ నుంచి ఈ ఫీట్ అందుకున్న మొట్ట మొదటి హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. దీనితో సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 
https://x.com/VDTrendsOffl/status/1705807113593966763?s=20