అప్పుడు అలా అన్నాడు కానీ.. తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ

Vijay Devarakonda About Anand Devaraknda Middle Class Melodies

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే యూత్‌లో ఓ క్రేజ్. సోషల్ మీడియాలో టాప్ స్టార్స్ కూడా సాధించని ఫీట్లు సాధించాడు. స్టార్ హీరోలను వెనక్కి నెట్టేసి మరీ ముందు వరుసలోకి దూసుకుపోయాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల విషయంలో విజయ్ అందరి కంటే ముందుంటాడు. విజయ్ ఏదైనా పోస్ట్ పెట్టాడంటే అది తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలంటే, అది కూడా విభిన్నంగా చేయాలంటే కేవలం విజయ్ దేవరకొండ వల్లే సాధ్యమవుతుంది.

Vijay Devarakonda About Anand Devaraknda Middle Class Melodies
Vijay Devarakonda About Anand Devaraknda Middle Class Melodies

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి తెలిసిందే. దొరసాని సినిమాతో ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. ఆనంద్ దేవరకొండలో విజయ్ చాయలు కనిపించడం, విజయ్ డైలాగ్ డెలీవరి పలకడం ప్లస్‌‌గానూ మైనస్ గానూ మారింది. మొత్తానికి మొదటి ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. ఆ సినిమా విషయంలో తాను ఎక్కడా కూడా కల్పించుకోలేదని, కల్పించుకోకూడదని, వారసత్వంగా వస్తున్నాడని ఎవ్వరూ అనుకోకూడదని విజయ్ చెప్పాడు.

అందుకే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ తాను చేయడం లేదని విజయ్ ఖరాఖండిగా చెప్పాడు. కానీ దొరసాని దారుణంగా బెడిసి కొట్టింది. అందుకే ఈ సారి మాత్రం విజయ్ దగ్గరుండి ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఆనంద్ కొత్త సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా నెట్ ఫ్లిక్స్‌లో నవంబర్ 20న రిలీజ్ కానుందని తెలిపాడు. సినిమా బాగుంది.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరం చూశామని చెప్పాడు. గుంటూరు సాంగ్‌తో మీ అందరికీ ఆకలి వేస్తుంది.. అందుకే సినిమా ప్రారంభానికి ముందే.. చేతిలో పాప్ కార్న్ పట్టుకుని ఉండండని అంచనాలు పెంచేస్తున్నాడు.