Vijay Devarakonda : లైగర్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాలను కూడా అప్పుడే లైన్ లో పెట్టేసాడు. లైగర్ తర్వాత మరోసారి పూరీ జగన్నాథ్ తోనే సినిమా తీయబోతున్నాడు రౌడీ. జన ఘన మన అనే పేరును కూడా ఈ సినిమా కు అనుకున్నారు. ఇక లైగర్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ ముంబైలో ఈనెల 29వ తేదీన కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ త్వరలోనే ఈ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలు నిజం అంటున్నారు. ఇదే వాస్తవం అని చాలా మంది చెబుతున్నారు. దీనికి తోడు చార్మీ రీసెంట్ గా పెట్టిన ట్వీట్ లాంచ్ ఉంది అనడానికి బలమైన సమాధానం గా నిలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించే పోతుంది అని అంటున్నారు టాలీవుడ్ లో అగ్ర సంగీతదర్శకుడిగా ఉన్న ఈ చిత్రంలో సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు తీసి ముందుగా విడుదల చేసి ఆ తర్వాత జనగణమన సినిమాను విడుదల చేసే విధంగా విజయ్ దేవరకొండ ప్లాన్ చేశాడు. ఇక ఆ తర్వాత సుకుమార్ ప్రాజెక్టును లైన్ లో పెట్టుకున్నాడు. ఇక లైగర్ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతుండగా ఆ రోజున ఈ సినిమా ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది చూడాలి.