Rakshith shetty : చార్లీగా రాబోతున్న కన్నడ హీరో.. టైటిల్ పాత్ర పోషించనున్న కుక్క…!

Rakshith Shetty : అతడే శ్రీమన్నారాయణu అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి.ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేక పోయింది.తాజాగా రక్షిత్ శెట్టి ‘777 ఛార్లీ’తో అలరించేందుకు సిద్ధమయ్యారు.అడ్వంచరస్‌ కామెడీగా రూపొందిన చిత్రంలో ఆయన ధర్మ అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. జూన్‌ 10న సినిమాను విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. పలు దక్షిణాది భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది.

కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ రిలీజ్ అవ్వనుంది.ఈ సినిమాలో ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రంలో చార్లీ అనే కుక్క కీలక పాత్రలో నటిస్తోంది. చార్లీ ఎదుర్కొన్న అనూహ్య పరిస్థితులు వాటిని అధిగమించేందుకు హీరోతో కలసి చేసిన సాహసాలు సినిమాకు ప్రధానాకర్షణ అని చిత్రబృందం తెలిపింది. ఛార్లి అనే కుక్క పిల్ల అనుకోని పరిస్థితుల్లో బయటకు వచ్చి ఇబ్బందలు పడినప్పుడు ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది. వారి మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది. చివరకు ఏం జరిగిందనే విషయాలను 777 ఛార్లి అనే అడ్వెంచరస్ కామెడీలో చూపించబోతున్నారు.

రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్‌.గుప్తాతో కలిసి తన పరమ్ వహ్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. కిరణ్ రాజ్‌.కె దర్శకుదర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ డేట్‌ను చిత్రయూనిట్ ప్రకటిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. విభిన్నమైన కథాంశం తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అల్లరిస్తుందో చూడాలి.