విజయ్ దేవరకొండ మరో ఉదయ్ కిరణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు !

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం లైగర్. ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాలని ఆశపడ్డ విజయ్ ఆశలు నెరవేరలేక పోయాయి. ఈ సినిమా ప్లాప్ అవటంతో తన జాతకాలతో సెలబ్రిటీల భవిష్యత్తు చెప్పే వేణు స్వామి విజయ్ దేవరకొండ భవిష్యత్తు గురించి వ్యాఖ్యలు చేశాడు.

వివాదాస్పద జాతకాలు చెప్పే వేను స్వామి విజయ్ దేవరకొండ జాతకం గురించి స్పందిస్తూ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కి అష్టమదశ శని ప్రభావం కొనసాగుతోందని, ఇటువంటి జాతకం ఉన్న వారి భవిష్యత్తు విభిన్నంగా ఉంటుందని వెల్లడించాడు. ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ మరో ఉదయ్ కిరణ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొదట ఉదయ్ కిరణ్ కూడా ఇండస్ట్రీ లో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో ఉదయ్ కిరణ్ కెరీర్ తలకిందులైపోయింది. అందువల్ల తన జాతకం ప్రకారం విజయ్ దేవరకొండ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని వేణు స్వామి వెల్లడించారు.

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సినిమాలు హిట్ అవటంతో స్టార్ హీరోలకు సమానంగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్స్ టాక్సీవాలా చిత్రాలు నిరాశను మిగిల్చాయి. ఇక ఇటీవల విడుదలైన లైగర్ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. లైగర్ సినిమా కోసం విజయ్ మూడు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. కానీ అతని కష్టానికి ప్రతిఫలం మాత్రం దక్కలేదు. ఈ సినిమాతో విజయ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోతాడని అతని అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కానీ ఈ సినిమా ప్లాప్ అవటంతో వారి కళ నెరవేరలేకపోయింది. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన అనే మరొక సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా సమంత తో కలిసి ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు.