“వీరసింహా రెడ్డి” గాని ఇలా తీసుంటే పక్కా ప్లాప్.!

Veera-Simha-Reddy-Box-Office1673581264174

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ మరియు మలయాళ బ్యూటీ హానీ రోజ్ లు నటించారు.

అయితే ఈ సినిమా ఈరోజు తో 50 రోజులు రన్ ని కంప్లీట్ చేసుకోగా సినిమా మేకర్స్ ఈ వేడుకలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో మంచి విజయం అందుకోవడానికి అందులో బాలయ్య చేసిన వీరసింహా రెడ్డి రోల్ అనే చెప్పడంలో సందేహమే లేదు. రెండు పత్రాలు చేసిన బాలయ్య వీరసింహా రెడ్డి గా జీవించేసారు.

దీనితో ఇది తన కెరీర్ లో మరో ఐకానిక్ రోల్ గా నిలిచిపోగా ఈ సినిమా షూటింగ్ కి స్టార్ట్ లో అయితే ప్రతి సినిమాకి చేసినట్టుగా హీరో హీరోయిన్స్ కి లుక్ టెస్ట్ ని చేస్తారు. అదే విధంగా ఈ సినిమాకి బాలయ్య లుక్ టెస్ట్ చేసిన పిక్ అయితే బయటకి వచ్చింది. అది చూసి అయితే సదరు బాలయ్య అభిమానులే కొంత షాక్ అవుతున్నారు.

బాలయ్య గత సినిమాలు రూలర్ ఇతర వరస్ట్ లుక్ టెస్ట్ అయితే ఇందులో కనిపిస్తుంది. దీనితో ఒకవేళ ఈ లుక్ లో గాని బాలయ్య ని చూపించి ఉంటే ఈ సినిమా మరో డిజాస్టర్ అయ్యి ఉండేది అని వారు అనుకుంటున్నారు. మొత్తానికి అయితే గోపీచంద్ అండ్ టీం బాలయ్య లోని సూపర్ లుక్ తో అయితే వీరసింహా రెడ్డి ని మంచి విజయంగా మలిచారు. ఈ రెండు రోజులు అయితే ఆ ఫోటోలు బాగానే సర్క్యులేట్ అయ్యాయి కానీ మళ్ళీ వాటిని తొలగించారు.