హనీ రోజ్‌కి మళ్లీ బాలయ్యే ఛాన్స్ ఇవ్వబోతున్నాడా.?

హనీ రోజ్.. ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో ఈ పేరు తెగ మార్మోగిపోయింది. సీనియర్ మలయాళ నటి అయిన హనీ రోజ్.. అప్పట్లో ఎప్పుడో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ, అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో మలయాళ సినిమాలకే పరిమితమైపోయింది.

బాలయ్య పుణ్యమా అని ఈ తేనె గులాబీని సరికొత్త సువాసనలతో మళ్లీ టాలీవుడ్‌కి పరిచయం చేశారు బాలయ్య. ప్రచారానికి తగ్గట్లుగానే హనీ రోజ్ తనదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంది ఈ సినిమాలో.

మెయిన్ హీరోయిన్ అయిన శృతి హాసన్‌ కన్నా హనీ రోజ్ పాత్రకే ఎక్కువ పాపులారిటీ వచ్చింది కూడా. అయితే, ఆ స్థాయిలో పాపులారిటీ వచ్చినా కూడా హనీ రోజ్ వైపు ఎవ్వరూ కన్నెత్తయినా చూడలేదు.

మళ్లీ బాలయ్య ఇంకో ఛాన్స్ ఇవ్వాలని హనీ రోజ్ కోరుకుంటోందట. బాలయ్యది పెద్ద మనసు. అందుకే తన కొత్త సినిమాలో హనీ రోజ్ కోసం ఓ గెస్ట్ రోల్ ప్లాన్ చేయించాడనీ తెలుస్తోంది. అయితే, ఏంటా సినిమా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

బాలయ్య ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హనీ రోజ్‌కి చాన్స్ లేదు. ఎందుకంటే ఈ సినిమా దాదాపు ఫైనల్ షూట్‌కి వచ్చేసింది.

మళ్లీ అనిల్ రావిపూడితోనే బాలయ్య ఇంకో సినిమా చేయబోతున్నారు. బహుశా ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తారో లేదంటే, పలు కొత్త సబ్జెక్టులు కూడా బాలయ్య ఓకే చేసి పెట్టారు. వాటిలో ఏదో ఒకదాంట్లో ఈ తేనె గులాబీకి అవకాశమివ్వబోతున్నారేమో. ఈ సారైనా హనీ రోజ్ తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలిక.