సాంగ్ టాక్ : కాపీ కొట్టినా పండుగలా “వీరసింహా రెడ్డి” మొదటి పాట.!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మరో చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు గోపీచంద్ మలినేనితో తెరకెక్కించిన ఈ చిత్రం ఓ పక్క షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ ఉండగా మరోపక్క సినిమా నుంచి అప్డేట్స్ కూడా బయటకి వస్తున్నాయి.

ఇక ఈ సినిమా నుంచి అయితే ఈ రోజే సినిమా నుంచి జై బాలయ్య అనే మాస్ ఆంథెమ్ ని రిలీజ్ చేసేసారు. అయితే ఇది వరకే ఈ సాంగ్ లీక్ కూడా కాగా అప్పుడే ఈ సాంగ్ విజయశాంతి ఒసేయ్ రాములమ్మ సాంగ్ లా ఉందని అనిపించినట్టుగా తెలిపాము.

మరి అది నిజం చేస్తూనే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. అయితే మధ్యలో పక్కా కాపీ ట్యూన్ లానే అనిపించినా మొత్తంగా మాత్రం థమన్ మేనియా చూపించాడు. పాట అంతటిని ఓ పండగలా, సంబరంలా చేసేసాడు. అలాగే సాంగ్ లో బాలయ్యని ఎలివేట్ చేస్తూ ఉన్న లిరిక్స్ అదిరిపోయాయి.

అయితే ఈ సాంగ్ లో బాలయ్య లుక్స్ తన డాన్స్ లు అభిమానులతో మీటింగ్ విజువల్స్ అంతా బావున్నాయి కానీ సంగీత దర్శకుడు థమన్ అయితే ఈ సాంగ్ లో ఓ సర్ప్రైజ్ ప్యాకింగ్ అని చెప్పొచ్చు. పక్కా ఊర మాస్ బాలయ్య ఫ్యాన్ లా తాను కనిపించాడు.

సాంగ్ స్టార్టింగ్ లో అలాగే ఎండింగ్ లో తన రచ్చ కూడా మామూలుగా లేదు అనుకోండి. మొత్తానికి మాత్రం కాపీ ట్యూన్ కొట్టినా మంచి పండగలాంటి సాంగ్ తమన్ ఇచ్చేసాడు.

Veera Simha Reddy - Jai Balayya Mass Anthem Lyric | Nandamuri Balakrishna | Shruti Haasan | Thaman S