బిగ్ అప్డేట్ : ఏ సమయంలో అయినా “వీరసింహ రెడ్డి” బ్లాస్ట్..!

ఇప్పుడు టాలీవుడ్ మాస్ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న “వీరసింహ రెడ్డి” కూడా ఒకటి. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అయితే హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై అయితే లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. ఈరోజు ఏ సమయంలో అయినా కూడా ఈ సినిమా నుంచి ఓ బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందట. అయితే చాలా వరకు సినిమా ఫస్ట్ పాట అలాగే సినిమా రిలీజ్ డేట్ అంశాల్లో అందరిలో ఆసక్తి నెలకొంది.

మరి చిత్ర యూనిట్ అయితే ఈరోజు ఏ అప్డేట్ ని అందిస్తారో అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ మరియు దునియా విజయ్ లాంటి ఇతర బిగ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.