Ghani : వరుణ్ తేజ్ గని అప్పుడే ఓటీటీ లోకి…ఆహా లో వచ్చేస్తోంది…!

Ghani : వరుణ్ తేజ్ గని సినిమాతో హ్యాట్రిక్ కొడతాడానుకుంటే నిరాశపరిచాడు. ఆర్ఆర్ఆర్ ఓ వైపు దెబ్బతీస్తే పాత కథనే రంగులు మార్చి కొత్తగా చూపించడంతో ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఇక సినిమా బడ్జెట్ రాబట్టొకోవడం కూడా కష్టమైపోతోంది.వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మెగా అభిమానులను నిరాశపరిచింది.

సినిమాలో వరుణ్ కి జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది.కన్నడ స్టార్‌ ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, జగపతి బాబు. నదియా కీలక పాత్రలు పోషించారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు బాబీ ఈ సినిమాతో తొలిసారి నిర్మాతగా మారారు. బాక్సింగ్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ స్టోర్ట్స్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో థియేటర్లలో విడుదలైన మూడు వారాలలోపే డిజిటల్‌ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆహా ఒరిజినల్స్ లో సినిమా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.